హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న తహసీల్దార్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాములు, కార్యదర్శి రమేశ్ పాక కోరారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం సీసీఎల్ఏ కార్యాలయం ప్రాంగణంలో జరిగింది.
ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఇటీవల రె వెన్యూ అధికారులపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని డి మాండ్ చేశారు.
చార్మినార్ జోన్లో ఆపి న పదోన్నతులను వెంటనే విడుదల చే యాలని కోరారు. కార్యక్రమంలో సెక్రట రీ జనరల్ ఫూల్ సింగ్ హాన్, కోశాధికారి శ్రీనివాస్ శంకర్రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ పాల్గొన్నారు.