KCR | ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
KCR | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ.. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నదని ఒక ప్రకటనలో ఆరోపించారు.
- కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితం
- బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు
KCR | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ.. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నదని ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఇటీవల జరిగిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయని తెలిపారు. ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్నదని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నదని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపిత అరెస్టు అని తెలిపారు. అక్రమ కేసులను వెంటనే వెనకి తీసుకొని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

