పాట్నా అక్టోబర్ 4: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఒకటి లేదా రెండు దశల్లో నిర్వహించాలని, పో లింగ్ కేంద్రాల వద్ద బురఖా ధరించి వచ్చే మహిళల ఐడీ కార్డులను సక్రమంగా తనిఖీ చేయాలని ఎన్నికల కమిషన్ను బీజేపీ కోరింది. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీవీసీ) జ్ఞానేష్ కుమార్ సారథ్యంలోని ఎన్నికల సం ఘం బృందంతో శనివారం సమావేశమైన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ ఎన్నికలను ఒకటి లేదా రెండు దశలలో నిర్వహించాలని ఎన్నికల సం ఘాన్ని కోరినట్టు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పొడిగించవద్దని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఓటర్ల గుర్తింపు కార్డుల్లో ఉన్న ఫోటోలతో ఓటర్ల ముఖాలను సరిపోల్చడంపై జాగ్రత్త లు తీసుకోవాలని, బురఖా ధరించిన ఓటర్ల విషయంలో సక్రమంగా తనిఖీ చేయాలని కోరినట్టు వివరించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ర్టాన్ని సందర్శించిన ఎన్నికల కమిషన్ సభ్యులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో చర్చలు జరిపారు. త్వరలోనే రాష్ట్ర శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.
వివరణ తీసుకున్నాకే జరిమానా విధించాలి
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): గ్రావెల్ అక్రమ తవ్వ కం, రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారికి ముందుగా నోటీసులు జారీచేసి, వివరణ తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అనధికారికంగా రవాణా చేసినప్పుడు టీఎస్ఎంఎంసీ నిబంధనల ప్రకారం జరిమానా విధించే అధికారం గనుల శాఖ సహాయ డైరెక్టర్ (ఏడీఎంజీ)కు ఉన్నదని, సీనరేజీ కంటే 10 రేట్లు అధికంగా జరిమానా విధించవచ్చని తెలిపింది. అయితే, జరిమానా విధించే ముందు వివరణ తీసుకోవాలని, భారీ జరిమానా విధి ంచాల్సి వస్తే అందుకు తగిన కారణాలను తెలియజేయాలని పేరొన్నది. అనధికారికంగా గ్రావెల్ రవాణా, త వ్వకాలు జరుపుతున్నారంటూ ఏడీఎంజీ ఇచ్చిన డిమాండ్ నోటీసును సవాలు చేస్తూ జీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఇతర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ ఈ తీర్పు వెలువరించారు.