ఖమ్మం, నవంబర్ 26: కేసీఆర్ చేపట్టిన దీక్ష కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు అన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 29 న జరిగే దీక్షా దివస్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు సండ్ర వెంకటవీరయ్య, లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.