హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన కీర్ స్టార్మర్‌కు కేసీఆర్ మనువడు హిమాన్షు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అకడమిక్ స్టడీలో భాగంగా తాను గతంలో లండన్ హౌస్ ఆఫ్ కామర్స్‌లో కీర్ స్టార్మర్ను కలిసిన ఫొటోను కూడా షేర్ చేశారు. అప్పట్లో స్టార్మర్తో కలిసి తాను మాట్లాడటం ఎంతో గౌరవంగా ఉన్నదని పేర్కొన్నారు.
చేనేత సమస్యలను పరిష్కరించాలి
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): చేనేత రంగ సమస్యలను పరిష్కరించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఆరు నెలలుగా 11 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. సమీకృత ప్రొక్యూర్మెంట్, ఉత్పత్తి, మారెటింగ్, తెలంగాణ చేనేత బ్రాం డ్‌ను ప్రపంచానికి పరిచయం చేయ డం, కార్మికుల సంక్షేమం, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ కొనుగోళ్లు, అధికారుల భాగస్వామ్యంతో సంక్షోభాన్ని నివారించవచ్చని సూచించారు. చేనేత కార్మిక సంఘాలు నేటి నుంచి తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు.
నీట్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : నీట్, నెట్ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన మోదీ, యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడని, ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీతో మరోసారి యువత నోట్లో మట్టి కొట్టాడని దుయ్యబట్టారు. ఇందుకు బాధ్యత వహించి మోదీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.