సిరిసిల్ల : కుట్రలు, కుతంత్రాలతో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం నుంచి తెలంగాణ భవిష్యత్‌ను కాపాడటమే కేసీఆర్ ( KCR ) లక్ష్యమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ( T. Jeevan Reddy) అన్నారు. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల జరిగిన జగిత్యాల సభ తెలంగాణ సమాజానికి దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పోవాలే కేసీఆర్ రావాలేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు యావ త్ తెలంగాణ ప్రజలకు జీవధార అని వెల్లడించారు. హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంప పెట్టు అని వివరించారు. కేసీఆర్, హరీష్‌రావు, అధికారులను కేసులో ఇరికించాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని అన్నారు.
ప్రతి రోజు రేవంత్ రెడ్డికి కలలో కేసీఆర్ కనపడుతున్నాడని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.