హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బీఆర్ఎస్ అధినేత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభానికి ముందు కేసీఆర్ జగన్కు ఫోన్ చేశారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా, జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్కు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
నిండు నూరేండ్లుప్రజాసేవలో కొనసాగాలి:కేటీఆర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేండ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో కొనసాగుతూ మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని అభిలషించారు.