KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. కొత్త ఆశలు, ఆకాంక్షలతో ఉత్సాహంగా నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థించారు.