మూడోసారీ సీఎం కేసీఆరే…
తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం కావడం పక్కా అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు.
- ప్రజల్లో బీఆర్ఎస్కు విశేష ఆదరణ
- స్టేషన్‌ఘన్‌పూర్‌లో గెలుపు ఖాయం
- ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 7 : తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం కావడం పక్కా అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేండ్లుగా జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, దళితబంధు, బీసీ చేయూత, రైతుబీమా, నేతన్న బీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో పాటు రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆసరా పెన్షన్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇవన్నీ విజయవంతంగా అమలుచేస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహకారం, ప్రజల ఆశీర్వాదంతో స్టేషన్‌ఘన్‌పూర్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని ప్రకటించారు. 2014, 2018 లో సీఎం కేసీఆర్ తాటికొండ రాజయ్యకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, అప్పుడు తాను, తన అనుచరులు ఆయన గెలుపు కోసం కృషిచేసినట్టు చెప్పారు.
ఇప్పుడు తన విజయానికి ఎమ్మెల్యే రాజయ్య కూడా సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అన్నారు. బీజేపీ నాయకులు హద్దు మీరి, స్థాయికి మించి, కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలపొంగులా పెరిగిన బీజేపీ ఇప్పుడు పాతాళంలోకి పడిపోయిందని, రేపు అధికారంలోకి వస్తామని కలలు కంటున్న బీజేపీ రాష్ట్రంలో సింగిల్ డిజిట్‌కే పరిమితకాక తప్పదని అన్నారు. కాంగ్రెస్ ఒక నుయ్యిలో పడ్డ కప్పల గుంపని, ఒకరు పైకి వస్తుంటే మరొకరు కాలు పట్టి కిందకు గుంజుతున్నారని, సీటు కోసం కొట్లాటకే కాంగ్రెస్ నాయకులు పరిమితమై సమయమంతా బుజ్జగింపులకే సరిపోతున్నదని కడియం ఎద్దేవా చేశారు. సమావేశంలో జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

