హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ మళ్లీ రావాలని, తెలంగాణ తిరుగులేని శక్తి గా ఎదగాలని రాష్ట్ర కార్పొరేషన్ మా జీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణను సాధించి, రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ మార్గదర్శనం అవసరాన్ని సమాజం గుర్తించిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం పరితపించిన సాధారణ పౌరుడిగా కేసీఆర్ తిరిగి తెలంగాణకు దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షించారు. మరో పది, పదిహేనేండ్లు కేసీఆర్ తెలంగాణకు మార్గదర్శనం చేయాలని అభిలషించారు.