హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ‘ఆయన మొదట రైతు కదా, ఆ గుండెకి మట్టిని తాకితేనే సంతృప్తి ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా, మన మూలాలను ఎప్పటికీ మర్చిపోని వ్యక్తిత్వానికి కేసీఆర్‌గారు నిలువెత్తు నిదర్శనం’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనుమడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు శనివారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
ఈ పోస్టుకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కలుపుమొక్కలను తీయిస్తూ.. ఆ పనిని పర్యవేక్షిస్తున్న కేసీఆర్ ఫొటోను జతచేశారు. సిట్ అధికారులను కేసీఆర్ తన ఇంటికి విచారించేందుకు ఆహ్వానించిన వేళ.. ఆయన మనుమడు, పెట్టిన ఫేస్బుక్ పోస్టు వైరల్‌గా మారింది. ఈ పోస్టుకు వేలల్లో లైకులు వస్తున్నాయి.