Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ చల్లని పాలన లో ప్రశాంతంగా జీవించామని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో బ్రతుకు దుర్భరమైందని తెలంగాణలోని చాలామంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇందుకు చాలా నిదర్శనాలు ప్రజానీకంలో, సామాజిక మాధ్యమాల్లో నిత్యం కనిపిస్తున్నాయి. అలాంటి మరో ఘ టన తెరపైకి వచ్చింది. రెండురోజుల కిందట జీహెచ్ఎంసీ సమావేశంలో ప్రజల పక్షాన గళమెత్తిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట పీఎస్‌కు తరలించారు.
అటుగా వెళ్తున్న ఓ వృద్ధురాలు గొడవంతా చూసి ఆవేదన వ్యక్తంచేసింది. ‘మా కేసీఆర్ సార్ మాకు ఇండ్లిచ్చిండు. ముసలొళ్లకు పింఛన్లిచ్చిండు. చేతగానోళ్లకు సాయం చేసిండు. కేసీఆర్ ధర్మాత్ముడు. సల్ల గ నూరేండ్లు బతుకుతడు. కేసీఆర్ పుణ్యంగల్ల తండ్రి. తెలంగాణకు కేసీఆరే దేవుడు.. కేసీఆరే తండ్రి… కాంగ్రెసోళ్లు గరీబోళ్లను, ముసలోళ్లను ఆదుకోవాలె. అన్నం పెట్టినొళ్లకు సున్నం పెట్టద్దు. అంటూ ఆవేదన కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవ్వకు కేసీఆర్ అంటే ఎంత ప్రేమ, అభిమానం, కృతజ్ఞత అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.