రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): గులాబీ బాస్, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జగిత్యాల సభ ము గించుకుని సోమవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా మీదుగా ఎర్రవల్లికి వెళ్లారు. సభ ముగిసిన అనంతరం రాత్రి 9 గంటలకు బస్సులో జగిత్యాల, కొండగట్టు, వేములవాడ, సిరిసిల్ల, తంగళ్లపల్లి మీదుగా సిద్దిపేట వైపు కేసీఆర్ కాన్వా య్ వెళ్లింది.
బస్సులోంచి సిరిసిల్ల, వే ములవాడ పట్టణాలు తిలకిస్తూ, సిరిసిల్ల మానేరువాగు వంతెన నుంచి కేసీఆర్ వెళ్లారు. రాత్రి 10 గంటలకు సి రిసిల్లకు కాన్వాయ్ చేరుకోగా, కేసీఆర్ బస్సులో నుంచి సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌ను ప్రత్యేకంగా తిలకించారు. అనంతరం సి రిసిల్ల బైపాస్ రోడ్లను సైతం పరిశీలిస్తూ వెళ్లారు. కేసీఆర్‌ను చూసిన అభిమాను లు ఆనందం వ్యక్తం చేస్తూ అభివాదం చేయగా, తాను కూడా అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు.