Karimnagar Simha Garjana | చారిత్రాత్మక కరీంనగర్ సింహ గర్జనకు నేటికి 24 ఏండ్లు అవుతుంది. నాటి సింహ గర్జన నుండి.. నేటి రజతోత్సవ సభ వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ది అదే జోష్. కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే! గత కాలపు గాయాలు వెన్నాడే వైఫల్యాలు.. ఆవెంటే అపనమ్మకాలు.. మెజారిటీ ఆధిపత్య వాదాలు.. వేళ్లూనుకున్న ‘జాతి’ సిద్ధాంతాలు.. సొంత గడ్డమీదే బానిస బాధిత బతుకు బతుకుతున్న పౌరులు. ఇది కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి.
సరిగ్గా ఇదే రోజు 24 సంవత్సరాల క్రితం మే 17, 2001న.. ధన బలం లేదు. రాజకీయ బలగం పెద్దగా లేదు. అయినా ఒక మనిషిని నమ్మి సభా స్థలికి పోటెత్తిన జనం. తనను కన్నభూమి తెలంగాణ ఎందుకిలా గోస పడుతున్నదన్న ఆవేదన, మాతృభూమిపై గుండెల నిండా పొంగే తెలంగాణ ప్రేమ, రాష్ర్టాన్ని సాధించాలన్న నిండైన పట్టుదల, ప్రజలు అండగా ఉంటారన్న భరోసా.. ఈ నాలుగే ఉద్యమ నాయకుడు కేసీఆర్ను నడిపించిన నాలుగు రథ చక్రాలు!
కరీంనగర్ సింహగర్జన సభలో కేసీఆర్ అన్న మాటలు. ఇవన్నీ నూటికి నూరుశాతం ఎలా నిజమయ్యాయో, లేవనెత్తిన సమస్యలకు ఆయన ఎలా పరిష్కారాలు చూపించారో ఇప్పుడ మన కండ్ల ముందు ఉన్నది.