బిజినేపల్లి, మే 21 : వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, నాగర్‌కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్‌రెడ్డి గెలువాలని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి పంచాయతీ పరిధిలోని బండమీదితండాకు చెందిన ప్రవీణ్‌నాయక్ తన కుడిచేతిపై పచ్చబొట్టు వేయించుకొని తన అభిమానాన్ని చూరగొన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్, నియోజకవర్గంలో మర్రి అంటే ఎంతో అభిమానమని పేర్కొన్నాడు. ఈ యువకుడిని మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, తిమ్మాజిపేట మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్ శాలువా కప్పి సన్మానించారు.