హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ తెలుగు సంసృత భాషా పండితులు కండ్లకుంట అళహ సింగరాచార్యుల మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సింగరాచార్యులు భాషాసాహిత్య కృషిని, అధ్యాపకులుగా, ఉపన్యాసకులుగా, రచయితగా, వ్యాకరణ పండితుడిగా చేసిన సేవలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కుమారుడు ఎడిటర్ కే శ్రీనివాస్ సహా కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. అళహ సింగరాచార్యుల మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. సింగరాచార్యుల మృతిపట్ల ఎమ్మె ల్సీ గోరెటి వెంకన్న దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.