హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాలను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముమ్మరం చేశారు. రజతోత్సవ వేడుకల నేపథ్యంలో వివిధ జిల్లాల నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఎర్రవెల్లి నివాసంలో గురువారం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ముఖ్యనాయకులతో పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ, పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. పలు అంశాలపై కేసీఆర్ రెండు జిల్లాల ముఖ్యనాయకులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, జోగినపల్లి సంతోష్‌కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, కోవ లక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు (కరీంనగర్), తోట ఆగయ్య (సిరిసిల్ల), జోగు రామన్న (ఆదిలాబాద్), బాల సుమన్ (మంచిర్యాల), మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టా మధు, కల్వకుంట్ల విద్యాసాగరరావు, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్‌రావు, జిల్లాల నాయకులు దావ వసంత, చల్మెడ లక్ష్మీనరసింహారావు, జాన్సన్ నాయక్, రామకృష్ణారెడ్డి, రమాదేవి, కిరణ్ కొమ్మెర, విలాస్, శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.
రచయిత, గాయకుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రచించి, గానం చేసిన ‘బండెనక బండి కట్టి గులాబీల జెండా పట్టి…’ అంటూ సాగే బీఆర్ఎస్ రజతోత్సవ పాటను పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ఎర్రవెల్లి నివాసంలో ఆవిషరించారు. నాటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని పేరొంటూ రజతోత్సవం సందర్భంగా పాటలు, కళారూపాలను రూపొందించాలని ఈ సందర్భంగా రసమయికి కేసీఆర్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.