కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరం : మంత్రి మల్లారెడ్డి
ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 22 : అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం తరహాలో భారత దేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరమని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించనున్న పల్లె దవాఖాన, రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు సైతం నాణ్యతతో కూడిన విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బస్తీ, పల్లె దవాఖానల ఏర్పాటుతో ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందుతుందన్నారు.
ఎదులాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె దవాఖానకు తన సొంత నిధులు రూ. 2 లక్షలు వెచ్చించి పర్చీచర్ ఇప్పించిన ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అభినందనీయుడని మంత్రి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

