హయత్‌నగర్, జూన్ 14 : రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం కేసీఆర్‌ను కించపర్చేలా స్కిట్ చేయించిన వారిలో మరో ఇద్దరు బీజేపీ రాష్ట్ర మహిళా నేత రాణిరుద్రమ, కళాకారుడు బొడ్డు ఎల్లన్న అలియాస్ దరువు ఎల్లన్నను హయత్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, తట్టిఅన్నారంలోని జేకన్వెన్షన్లో బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్వహించిన ఈ స్కిట్లో సీఎం బొమ్మను పెట్టుకొని, ప్రజా సంక్షేమ పథకాలను కించపరుస్తూ రెచ్చగొట్టేలా ప్రదర్శన ఇచ్చారు.
దీంతో టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ, కళాకారుడు బొడ్డు ఎల్లన్న అలియాస్ దరువు ఎల్లన్నపై హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బండి సంజయ్‌కు 41ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసు జారీచేశారు. ఇటీవలే జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించగా బెయిల్‌పై విడుదలయ్యారు. రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను పోలీసులు విచారించి మంగళవారం విడుదల చేశారు.