Madhusudhana Chary | కేసీఆర్కు సిట్ నోటీసులపై మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యక్తి కాదు.. శక్తి అని తెలిపారు. తెలంగాణ సమాజం అభిమానించే, ఆరాధించే గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకుడిపైనే దుర్మార్గానికి తలపెట్టడం ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఇవాళ తెలంగాణలో జరుగుతున్న తంతును సమాజం వేయికళ్లతో గమనిస్తోందని మధుసూధనాచారి తెలిపారు. విచారణలు, అరెస్టులు, బెదిరింపులతో ప్రతిపక్షాన్ని భయపెట్టాలని అనుకోవడం మీ భ్రమ అని వ్యాఖ్యానించారు. రేవంత్.. నీ పతనం ఈ రోజు నుంచే మొదలైందని గుర్తుంచుకో అని హెచ్చరించారు.