హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో నలుగురు మహిళలకు టికెట్లు ఇవ్వగా, అందులో ముగ్గురు విజయం సాధించారు. ఈసారి అదనంగా మరో ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. 2018 ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి ఓటమిపాలైన కోవా లక్ష్మీకి మళ్లీ చాన్స్ ఇచ్చారు.
మెదక్, ఆలేరు, ఇల్లెందు స్థానాల నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన పద్మా దేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీత, హరిప్రియానాయక్‌కు ఈసారి కూడా టికెట్లు కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి క్రితం సారి గెలుపొందిన సాయన్న మరణించడంతో ఆయన కూతురు లాస్య నందితకు అవకాశమిచ్చారు.
ఆసిఫాబాద్:కోవా లక్ష్మి
మెదక్- పద్మా దేవేందర్‌రెడ్డి
మహేశ్వరం- సబితారెడ్డి
కంటోన్మెంట్: జీ లాస్య నందిత
ఆలేరు:గొంగిడి సునీత
ములుగు: నాగజ్యోతి
ఇల్లెందు: హరిప్రియానాయక్