హైదరాబాద్: కేసీఆర్ కేవలం తనకు మాత్రమే కాదు యావత్ తెలంగాణ జాతికి హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కారణజన్ముడు కేసీఆర్ కొడుకుగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేద గుర్తుచేశారు. మీడియా, మనీ, మజిల్ పవర్ లేకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలిలో విపక్ష నేత మధుసూధనా చారి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను స్వప్నించి సాకారం చేసిన మహోన్నతుడు కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్రంలో ఎవరిని కదిపినా మళ్లీ కేసీఆర్ రావాలంటున్నారని వెల్లడించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అందరం కలిసి పనిచేద్దామన్నారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
LIVE: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు.
📍తెలంగాణ భవన్, హైదరాబాద్#HappyBirthdayKCR https://t.co/fTxmT6WGpE
— BRS Party (@BRSparty) February 17, 2025
తెలంగాణ జాతిది వీరోచితమైన చరిత్ర అని మండలిలో విపక్ష నేత మధుసూదనా చారి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎంతో నష్టపోయిందని చెప్పారు. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి కేసీఆర్ చలించిపోయారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు జరిగాయని వెల్లడించారు. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత కేవలం ఏడాదిలో దేశం మొత్తం మనవైపు చూసేలా తయారు చేశారని చెప్పారు. తెలంగాణను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ సత్తా ఏంటో చంద్రబాబు, వైస్సార్‌కు తెలుసని వెల్లడించారు.
LIVE: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు.
📍తెలంగాణ భవన్, హైదరాబాద్#HappyBirthdayKCR https://t.co/fTxmT6WGpE
— BRS Party (@BRSparty) February 17, 2025