హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను వరంగల్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు బుధవారం ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యారు. మహాసభ నిర్వహణ, ఏర్పాట్లపై వారితో చర్చించారు. పలు అంశాలపై వారికి అధినేత దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, డాక్టర్ యాదవ్రెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, సునీతాలక్ష్మారెడ్డి, సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, పార్టీ నేతలు జైపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ బిగాల, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అశన్నగారి జీవన్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దీన్, నాయకురాలు అయేషా షకీల్‌తోపాటు మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్‌రావు తదితరులు హాజరయ్యారు.