హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు బీ ఫాం అందించారు.
హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో శనివారం మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో కేసీఆర్ బీ ఫాం అందించారు. ఉప ఎన్నికలో పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని, జిల్లాలో స్థానిక సంస్థల్లో పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నందున బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమేనని కేసీఆర్ చెప్పారు.