KCR | రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరిసేలా దీవించు గణపయ్య : కేసీఆర్
KCR | వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
KCR | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరిసేలా దీవించాలని గణనాథుడిని కేసీఆర్ ప్రార్థించారు. అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆదిదేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సంప్రదాయంలో ప్రత్యేక పూజలు అందుకుంటారని తెలిపారు.
దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణనాధుని నవరాత్రి వేడుకలు, పల్లె నుంచి పట్టణం వరకు ప్రజల సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి పర్వదినం నుంచి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజల్లో మతసామరస్యం, దైవభక్తి, సమష్టితత్వం మరింతగా బలపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

