హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : మహ్మద్ ప్రవక్త పుట్టినరోజై మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త అం దించిన మానవీయ విలువలు ప్రతి ఒకరికీ మార్గదర్శకమని పేరొన్నారు. సమాజంలో సోదరభావం, శాంతి, సహనం, ప్రేమ, కరుణ వంటి ఉత్తమ గుణాలను పెంపొందించుకోవాలని బుధవారం ప్రకటనలో పిలుపునిచ్చారు.
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ముస్లింల అభ్యున్నతికి అనేక సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం గంగా-జమునా తహజీబ్‌కు పట్టుగొమ్మగా నిలిచిందని తెలిపారు. లౌకికవాద స్ఫూర్తిని ప్రతిఒకరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.