హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సాధించిన నీలి విప్లవం దాచేస్తే దాగని సత్యం, చెరిపేస్తే చెరగని చరిత్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. 2016-17 నుంచి 2023-24 మధ్యకాలంలో చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను తెలంగాణకు ‘ఉత్తమ ఇన్‌ల్యాండ్ స్టేట్’ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ‘దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చరగని చరిత్ర.. కేసీఆర్ తెలంగాణలో సాధించిన ‘నీలి విప్లవం’. 2016-17లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుంచి 2023-24 కు 4.39 లక్షల టన్నులు ఎగబాకిన వైనం. చేపల పెంపకంలో ఉత్తమ ‘ఇన్ ల్యాండ్ స్టేట్’గా తెలంగాణ అవార్డు కైవసం చేసుకోవడం కేసీఆర్ విజయం’ అని ట్వీట్ చేశారు.
చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణకు ఉత్తమ ఇన్‌ల్యాండ్ స్టేట్ అవార్డు దక్కింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ఢిల్లీలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, మత్స్యశాఖ డైరెక్టర్ ప్రియాంక ఆల, జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణన్ ఈ అవార్డును అందుకున్నారు. 2016-17 నుంచి 2023-24 మధ్యకాలంలో చేపల ఉత్పత్తిలో 1.9 లక్షల మెట్రిక్ తన్నుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి తెలంగాణ చేరుకున్నది.
దాచేస్తే దాగని సత్యం – చెరిపేస్తే చరగని చరిత్ర:
కేసీఆర్ తెలంగాణ లో సాధించిన
“నీలి విప్లవం” (Blue revolution).2016-17 లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుండి 2023-24 గు కు 4.39 లక్షల టన్నులు ఎగబాకిన వైనం.
తెలంగాణ చేపల పెంపకం లో ఉత్తమ “ఇన్ ల్యాండ్ స్టేట్” గా అవార్డు కైవసం… pic.twitter.com/ye86ah1bel
— KTR (@KTRBRS) November 22, 2024