హైదరాబాద్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి (Sitaram Yechury)) మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు(KCR) సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని.. వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా, కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఆయన వయసు 72 ఏళ్లు. సీపీఎం ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ ఎంపీ అయిన ఏచూరి.. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో(AIIMS hospital) తుదిశ్వాస విడిచారు. ఆయనకు కొన్ని రోజుల నుంచి అక్కడే చికిత్స చేపడుతున్న విషయం తెలిసిందే. శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఏచూరి ఇవాళ మరణించినట్లు ఆ పార్టీ ప్రకటించింది.