సిద్దిపేట రూరల్, నవంబర్ 30 : సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ దంపతులు ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్లో గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా మధ్యాహ్నం 12.10 గంటలకు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. అనంతరం వారు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. సీఎం రాక సందర్భంగా గ్రామస్థులు పోలింగ్ కేంద్రానికి భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలో సీఎంతో కరచాలనం చేసేందుకు గ్రామస్థులు పోటీపడ్డారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలకిషన్‌రావు తదితరులు ఉన్నారు.
#WATCH | Telangana Elections | CM and BRS chief K. Chandrashekar Rao and his wife Shobha Rao arrive at the polling station in Chintamadaka, Siddipet to cast their votes. pic.twitter.com/ornI6PyPHo
— ANI (@ANI) November 30, 2023
#WATCH | Telangana CM KC Rao casts his vote in Chintamadaka, Siddipet of Medak district#TelanganaAssemblyElections2023 pic.twitter.com/FXH97alGju
— ANI (@ANI) November 30, 2023
#WATCH | Telangana CM KC Rao shows indelible ink mark on his finger after casting vote in Chintamadaka, Siddipet #TelanganaElections pic.twitter.com/8RyQrYWCP7
— ANI (@ANI) November 30, 2023