Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆనందంతో ముసిరిపోయిన నాగేశ్వరమ్మ.. పవన్ కల్యాణ్ ఐదుసార్లు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇప్పటంలో పలు ఇండ్లను కూల్చేశారు. వాటిలో జనసేన కార్యకర్తల ఇళ్లను కూడా అధికారులు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో జనసేన కార్యకర్తలు లక్ష్యంగా ఈ పని చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పటంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ తమను కలిసేందుకు రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ కల్యాణ్‌ను ఆ సమయంలో కోరింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇచ్చిన మాట కోసం ఇవాళ ఇప్పటంలోని నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ వెళ్లారు.
పవన్ కల్యాణ్ రావడంతో ఆయనకు నాగేశ్వరమ్మ ఆప్యాయంగా స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ కూడా ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె అవసరాల కోసం రూ.50 వేలు, ఆమె మనువడి చదువు కోసం రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. దీంతో నాగేశ్వరమ్మ ఎంతో మురిసిపోయారు. నువ్వు ఐదుసార్లు ముఖ్యమంత్రి అవ్వాలి.. నేను చూడాలని ఆకాంక్షించారు. వృద్ధురాలి కోరిక వినగానే పవన్ కల్యాణ్‌తోపాటు అక్కడ ఉన్నవారంతా నవ్వేశారు.
నువ్వు ఐదు సార్లు సీఎం అవ్వాలి.. నేను చూడాలి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరిక కోరిన నాగేశ్వరమ్మ pic.twitter.com/aljf5qTRdo
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2025