KCR | బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కీలక బాధ్యతలు అప్పగించారు.
త్వరలోనే అన్ని స్థాయిల కమిటీలను నియమించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేసీఆర్ సూచించారు. బుక్ మీదనే కాకుండా ఆన్లైన్, ఆఫ్లైన్లో సభ్యత్వాలు నమోదు చేయాలని ఆదేశించారు.