హైదరాబాద్ 26 (నమస్తే తెలంగాణ): సరిగ్గా 25 ఏండ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసులు తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు. విద్యుత్‌రంగ సంసరణల్లో భాగంగా చంద్రబాబు సరార్ విద్యుత్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. తొలుత సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్రవ్యాప్తఆందోళన చేపట్టాయి. ఆ ఆందోళనలు తీవ్రతరం దాల్చడంతో రైతులు, ప్రజలపై పోలీసులు బాష్పవాయువులు, కాల్పుల వర్షం కురిపించారు. ఈ దుర్ఘటనలో సత్తెనపల్లి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనే రైతులు మరణించారు. దుర్ఘటన జరిగి 28వ తేదీకి 25 ఏండ్లు పూర్తయ్యాయి. అయినా నేటి పాలకుల్లో ఆ నిరంకుశత్వ ధోరణి తగ్గలేదని రాష్ట్ర రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
విద్యుత్ సంస్కరణలు వ్యతిరేకించిన కేసీఆర్..
చంద్రబాబునాయుడి పాలనను రైతు వ్యతిరేక, నిరంకుశ పాలనగా రైతులు ముద్రవేశారు. ఈ ఘటన తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక మలుపు దశగా మారింది. అప్పటి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) ఈ విద్యుత్ సంసరణలను వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబుతో, ఆయన విధానాలతో విభేదిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని స్థాపించారు. స్వరాష్ట్ర సాధన కోసం పదవులను త్యజించి.. ఎక్కడా తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ పడలేదు. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించాక కేసీఆర్ మొదటి ప్రాధాన్యం రైతులకే ఇచ్చారు.
పదేండ్లు సుభిక్షంగా రైతాంగం..
స్వరాష్ట్ర పాలనలో రైతుల కోసం కేసీఆర్ పరితపించారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా తీసుకొచ్చారు. మిషన్ కాకతీయతో చెరువులకు ప్రాణం పోసి.. లక్షల ఎకరాలను ఉపయోగంలోకి తెచ్చారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు కట్టారు. చివరి ఎకరా వరకూ నీళ్లు పారించారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ ప్రారంభం నుంచే యూరియా కొరత లేకుండా చూసుకున్నారు. రైతులు క్యూలలో యూరియా కోసం ఇబ్బందులు పడకుండా చూసుకున్నారు. నకిలీ విత్తనాల బెడద లేకుండా పోలీసులు, వ్యవసాయాధికారులను అప్రమత్తం చేశారు. ఒట్టిపోయిన వ్యవసాయాన్ని కేసీఆర్ కేవలం పదేండ్ల కాలంలో పండుగలా మార్చారు. దేశంలోని అత్యధికంగా వరిధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణను నిలిపారు.
నాడు కరెంటు.. నేడు యూరియా వెతలు..
స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం మారిన వెంటనే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి కష్టాలు రైతులను మళ్లీ పలుకరించాయి. తెలంగాణ రైతాంగం, వ్యవసాయం, నీటిపారుదలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుభవం లేకపోవడంతో వ్వవసాయం కుంటుపడుతున్నది. ముఖ్యంగా యూరియాపై ముందస్తు ప్రకాళిక లేకపోవడంతో 2024 నుంచీ నేటి వరకూ తెలంగాణలో రైతులు యూరియా కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. గంటల తరబడి క్యూలలో నిలుచునే ఓపిక లేక చెప్పులు, పాస్‌బుక్‌లు, ఆధార్‌కార్డులు లైన్లలో పెడుతున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారా యి. యూరియా దొరకదేమోనన్న భయంతో గుండెపోటు, కల్లుతిరిగి పడిపోవడం వంటి ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు నిరంకుశత్వ బాటలో శిష్యుడు రేవంత్‌రెడ్డి..
ఉమ్మడి ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు జమానా అంతా.. ‘వ్యవసాయం దండుగ’ అని బహిరంగంగా చెప్పుకునేవాడు. రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వడంలో, యూరియా అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించేవారు. వేల కోట్లు అప్పులు తెస్తూ.. రైతులను నట్టేట ముంచారనే విమర్శలు వచ్చేవి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రపంచ బ్యాంకు అనే పదం పదేండ్లలో వినిపించిన దాఖలాలేవు. మళ్లీ చంద్రబాబు ప్రియ శిష్యుడిగా పేరుగాంచిన రేవంత్‌రెడ్డి తెలంగాణలో అధికారం చేపట్టి మళ్లీ ప్రపంచ బ్యాంకు జపం చేస్తున్నారు. కేసీఆర్ పదేండ్లలో దేశానికి తెలంగాణ రైతన్న వెన్నుముకగా చెబితే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ రైతన్నలను గంటల తరబడి క్యూలల్లో నిలబెట్టి వెన్నుముక విరిచేస్తున్నారని రైతులు చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిరంకుశత్వంతో యూరియా సమస్య రైతులలో అసంతృప్తిని పెంచింది. కొన్ని ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ యూరియా సంక్షోభం రైతులను మానసిక ఆందోళనలోకి నెట్టేసింది. ఈ దారుణ పరిస్థితి 2000లో జరిగిన విద్యుత్ చార్జీల పెంపు వల్ల రైతులు ఎదురొన్న సమస్యలను గుర్తు చేస్తున్నది. రేవంత్‌రెడ్డి కూడా తన గురువైన చంద్రబాబుతో నిరంకుశత్వంలో పోటీ పడితే.. బషీర్‌బాగ్ లాంటి ఒక కొత్త ఉద్యమం ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.రైతులకు ఇక్కట్లు..