హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : తన మనుమడు హిమాన్షును బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో హిమాన్షు పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మనుమడిని శతమానంభవతి అంటూ కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు.
అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపుమేరకు హిమాన్షు మొక్క నాటారు. నానమ్మ శోభ, మాతృమూర్తి, కేటీఆర్ సతీమణి శైలిమ, అమ్మమ్మ శశికళ, వినోదమ్మ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సహా పలువురు కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకో పైలట్లకు సౌకర్యాలు
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలం గాణ) : దక్షిణ మధ్య రైల్వేలో లోకో పైలట్ల కు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు రైల్వే అ ధికారులు తెలిపారు. వారిపని గంటలను పరిశీలిస్తున్నామని, దీనిపై ఇప్పటికే సికిం ద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల అధికారు లు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ప్రకటిం చారు. లోకో పైలట్లు విశ్రాంతి లేకుండా రైళ్లు నడుపుతున్నారని, దాని ప్రభావం రైళ్ల భద్రతపై పడుతుందనే సమస్యలతో చేస్తు న్న ఆందోళనల నేపథ్యంలో రైల్వే ఉన్న తాధికారులు దిగి వచ్చి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది.