KCR | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట విధానాన్ని కమలం పార్టీ కాపీ కొడుతున్నది. రాష్ట్రంలో అసమర్థ సాగునీటి నిర్వహణ వల్ల జరుగుతున్న పంటనష్టంపై కేసీఆర్ సమరశంఖం పూరించడం, ప్రభుత్వం, ప్రజల నుం చి స్పందన రావడంతో బీజేపీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రభుత్వం రైతుబంధు వేయకపోయినా, సాగునీరు అందక పంటలు ఎం డుతున్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించని బీజేపీ.. కేసీఆర్ పర్యటన తర్వాత మేల్కొని, రైతులపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నది. రైతుల పక్షాన నిరసన దీక్షలు చేపడుతామంటూ ప్రకటించింది. కేసీఆర్ పర్యటనలకు సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నది. గత నెల 31న కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించా రు. ఎండిన పంటలు పరిశీలించి, రైతులకు భరోసా కల్పించారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై గర్జించారు. కరువు పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు కేసీఆర్ పెద్ద దిక్కుగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు ల నుంచి కేసీఆర్ పర్యటనకు మంచి స్పందన లభించింది. వెంటనే ప్రభుత్వం స్పందించి సాగర్ నుంచి ఎడమ కాలువకు కృష్ణా జలాలను, ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు గో దావరి జలాలను వదిలింది. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
కేసీఆర్ పోరాటానికి సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో బీజేపీ రంగంలోకి దిగింది. కేసీఆర్ పర్యటిస్తున్న రోజే కొత్త నాటకానికి తెరలేపింది. రైతుల పక్షాన తాము ‘దీక్ష’ చేస్తామంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లో ప్రకటించారు. 2న కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో తూతూమంత్రంగా నిరసన చేపట్టారు. ఉదయం 10 గంటల తర్వాత దీక్షకు కూర్చొని.. మధ్యాహ్నం 2 గంటలకు ముగించేశారు. అంటే గట్టిగా నాలుగు గంటలు కూడా నిరసనలో కూర్చోలేదంటే బండి సంజయ్, బీజేపీ చిత్తశుద్ధి అర్థమవుతున్నదని రైతులు మండిపడుతున్నారు. కేసీఆర్ తన పర్యటనల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్లో పర్యటించనున్నారు. దీంతో బీజేపీ మరోసారి తెరమీదికి వచ్చింది. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. ఇది కచ్చితంగా డైవర్షన్ డ్రామా అని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇతర రోజులు వదిలిపెట్టి.. కేసీఆర్ పర్యటించే రోజునే నిరసనలు చేయడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నమని స్పష్టం చేస్తున్నారు.