KCR birthday: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ఉదయం రాష్ట్ర మాజీ మంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేక్ కట్ చేసి ముందుగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు తినిపించారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలకు మాజీ మంత్రులు, నగరంలోని MLA లు, MLC లు, కార్పొరేటర్లు, మాజీ MLA లు, మాజీ MLC లు, కార్పోరేషన్ల మాజీ చైర్మన్ లు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.