పవన్కేసరి, ప్రాముఖ్య జంటగా నటిస్తున్న ‘LUB’ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మణికంఠ పెదమల్లు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మహేష్ కుమార్, భగవాన్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి బీవీఎస్ రవి క్లాప్‌నివ్వగా, చైతన్యరెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. రొమాంటిక్ డ్రామా ఇదని, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలుంటాయని దర్శకుడు తెలిపారు.
సరికొత్త కాన్సెప్ట్‌తో నేటి యువత మెచ్చే సినిమా అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. అభితేజ్, జేడీవీ ప్రసాద్, మల్లిక లెల్ల, భానుప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుధ శ్రీనివాస్, నిర్మాణం: జేజే ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్, దర్శకత్వం: మణికంఠ పెదమల్లు.