KCR | ఇది మునుపటి యెడ్డి తెలంగాణ కాదు.. ఇది టైగర్ తెలంగాణ : కేసీఆర్
KCR | ఇది మునుపటి యెడ్డి తెలంగాణ కాదు.. లేచిన తెలంగాణ.. ఇది టైగర్ తెలంగాణ.. ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికిళ్లు ఎత్తి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.
KCR | నల్లగొండ : ఇది మునుపటి యెడ్డి తెలంగాణ కాదు.. లేచిన తెలంగాణ.. ఇది టైగర్ తెలంగాణ.. ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికిళ్లు ఎత్తి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. చలో నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడారు.
మీరు గెలిచిండ్రు ఐదేండ్లు అధికారంలో ఉండండి.. మాకు అభ్యంతరం లేదు. సరే ప్రతిపక్షంలోకి వచ్చాం నాలుగు రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా. కానీ ఏం జేసిండ్రు.. నల్ల ముఖం పిల్లి పోయి సచ్చిపోయిన ఎలుకను పట్టిందట. గవర్నమెంట్ వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్లను తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పజెప్పిండ్రు. కట్టమీద మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు. మంచినీళ్ల కోసం చిప్పపట్టుకుని అడుక్కోవాలి. శ్రీశైలం కరెంట్ ఉత్పత్తి చేయాలంటే అడుక్కోవాలి. మనకున్న అధికారాన్ని అప్పజెప్పిండ్రు. నేను తొమ్మిదేండ్లు కాపాడిన దాన్ని.. నన్ను కూడా బెదిరించారు.. ఏ కేసీఆర్ నీ గవర్నమెంట్ తీసేస్తాం.. రాష్ట్రపతి పరిపాలన పెడుతాం అన్నరు. దమ్ముంటే పెట్టమని చూద్దామన్నా.. కానీ అప్పజెప్పలేదు. నా మీద కూడా ఒత్తిడి తెచ్చిండ్రు. ఎప్పకప్పటిడు లెటర్లు రాసుకుంటూ పార్లమెంట్లో మన ఎంపీలు పోరాటం చేశారు. కానీ వీరు అప్పజెప్పిండ్రు అని కేసీఆర్ తెలిపారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి..
మొన్న మన ఎంపీలు కేంద్ర ఇరిగేషన్ మంత్రి వద్దకు పోయారు.. ఆ మంత్రిని కలిస్తే కేఆర్ఎంబీ ఎట్ల తీసుకుంటావు అని అడిగితే.. మీ గవర్నమెంట్ వచ్చి ఒప్పుకొని పోయిందని చెప్పారు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టిండ్రు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, ఇతర మంత్రులు గానీ ఇప్పటికైనా పిచ్చిన పనులు బంద్ చేసి, అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలి. మాట్లాడాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు ట్రైం ఫ్రేమ్ పెట్టాలి. దశాబ్దాల నుంచి అన్యాయం జరిగింది కాబట్ట ఆరు నెలల్లోగా తేల్చాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చేలా ఒత్తిడి తేవాలి. గొంగడి, చెప్పులు నావి కాదన్నట్టు.. నాకేం జిమ్మేదారి లేదనట్టు.. అధికారంలోకి వచ్చినం మళ్ల చూసుకుందాం ఐదేండ్ల నాటికి అనుకుంటే ఊరుకోరు. గర్జిస్తరు.. నిలదీస్తరు.. ఇది మునుపటి యెడ్డి తెలంగాణ కాదు.. లేచిన తెలంగాణ ఇది టైగర్ తెలంగాణ.. ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికిళ్లు ఎత్తి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- Godavari
- kaleshwaram
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

