Student Died In America | ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల వెంకటరమణ (27) అమెరికాలో వెస్ట్ ఫ్లోరిడాలో వాటర్ రేసింగ్‌లో పాల్గొన్నాడు. జెట్స్కి వాటర్ గేమ్స్‌లో ఎదురుగా వచ్చిన మరో వాటర్ బైక్ ఢీకొట్టింది. దాంతో తీవ్ర గాయాలకు గురై మృతి చెందాడు. వెంకటరమణ ఏడాదిన్నర అమెరికాకు వెళ్లాడు.
అమెరికాలో మాస్టర్స్ ఇన్ మెడికల్ ఇన్ఫర్మేట్రిస్ ఇన్ (IUPUI) యూనివర్సిటీలో చదువుకుంటూ ఇండియానా పోలీస్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వెంకటరమణ తండ్రి రాజ గనేశ్ రైల్వేలో గార్డుగా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, అమ్మాయి ఉన్నారు. కూతురుకి పెళ్లి చేయగా.. కొడుకును ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపారు. వెంకటరమణ మృతదేహం తరలించేందుకు ఆదివారం లేక సోమవారం కాజీపేటకు రావచ్చని బంధువులు పేర్కొన్నారు.