Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచ స్థాయి కంపెనీ కేయిన్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. కేయిన్స్ నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.
రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది కేయిన్స్ టెక్నాలజీ సంస్థ. రూ. 2,800 కోట్ల పెట్టుబడితో ఓసాట్, కాంపౌండ్ సెమీ కండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సెమీ కండక్టర్ పరిశ్రమకు ఆతిథ్యం ఇచ్చే ప్రతిష్టాత్మక ప్రపంచ గమ్యస్థానాల లీగ్లో తెలంగాణ చేరినందుకు గర్వకారణంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఫ్యాక్స్ కాన్, కార్నింగ్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
Delighted to welcome @Kaynestech for setting up of OSAT & Compound Semiconductor manufacturing facility in Telangana, with an investment of 2800 Cr generating 2000 jobs. 😊
Proud moment for Telangana as we now join the league of coveted global destinations that host… pic.twitter.com/2Z8e4DJcJ7
— KTR (@KTRBRS) October 6, 2023