Mammootty | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ “కలంకావల్” (Kalamkaval) డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 16 నుంచి మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో మమ్ముట్టి గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక విలక్షణమైన సైకో పాత్రలో కనిపించబోతున్నారు. మమ్ముట్టితో పాటు వర్సటైల్ యాక్టర్ వినాయకన్ కీలక పాత్రలో నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. జితిన్ కె జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మమ్ముట్టి స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ‘మమ్ముట్టి కంపెనీ’పై నిర్మించారు. వేఫరర్ ఫిల్మ్స్ మరియు ట్రూత్ గ్లోబల్ ఫిల్మ్స్ భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.
Stanley Das is coming!
Witness Mammootty like never before in #Kalamkaval, streaming from Jan 16, only on Sony LIV.#Mammootty @mammukka
#Vinayakan #MammoottyKampany #JithinKJose @SamadTruth
#WayfarerFilms #TruthGlobalFilms #KalamkavalOnSonyLIV pic.twitter.com/ZGXIZhV3EG— Sony LIV (@SonyLIV) January 11, 2026