Ashwini Vaishnaw | సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీ ఉందని పేర్కొన్నారు. 2026లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ నుంచి ఇప్పటికే ఐదు వందే భారత్ ట్రైన్స్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో దేశమంతా దాదాపు వంద అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తీసుకురానున్నట్లు తెలిపారు. ఏపీకి రూ.8,455 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశామన్నారు. ఏపీలో 73 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించామన్నారు. యూపీఏ హయాంలో కంటే ఏపీకి 11 రెట్ల కేటాయింపులు పెరిగాయని చెప్పారు.