కేసముద్రం, మార్చి 17: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామ సమీపంలోని అడవిలో శనివారం రాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. కాట్రపల్లి గ్రామం నుంచి నెక్కొండ నాగారం వెళ్లే దారికి ఇరువైపులా ఉన్న ఫారెస్టు భూమిలో అధికారులు కొన్నేండ్ల క్రితం జామాయిల్ మొక్కలు నాటారు.
అయితే వేసవి రావడం, జామాయిల్ చెట్లకు ఉన్న ఆకులు పూర్తిగా రాలిపోయాయి. ప్రమాదవశాత్తు వాటికి నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. దీంతో జామాయిల్ చెట్లు స్వల్పంగా కాలిపోయాయి. దాదాపు 10 ఎకరాల వరకు చెట్లు కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు.