కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 21 : స్వేచ్ఛాయుత (మెర్సి కిల్లింగ్) మరణానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి, ప్రధాని నరేంద్ర మోదీకి కరీంనగర్ మధునగర్ నివాసి కట్ల శ్రీనివాస్ లేఖ రాశారు. శుక్రవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 56 ఏండ్లున్న తనకు 16 ఏండ్ల వయసులోనే కండరాల క్షీణత వ్యాధి వచ్చిందని తెలిపారు. 40 ఏండ్లుగా ఈ వ్యాధిని అనుభవిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో దవాఖానలు తిరిగానని, మందులు వాడినా వ్యాధి తగ్గలేదని పేర్కొన్నారు. 2012లో హైకోర్టుకు లేఖ రాసినా ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత మరణం కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానికి లేఖల ద్వారా విన్నవిస్తున్నట్టు తెలిపారు.