హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): విచారణల పేరుతో రాజకీయంగా కేసీఆర్ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతున్నదని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశ రక్షణ కోసం ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చని, ఆనాడు మన్మోహన్సింగే చెప్పారని గుర్తుచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.