బాలరాజు యాదవ్ అరెస్టు అప్రజాస్వామికం.. వెంటనే విడుదల చేయాలి: కర్నె ప్రభాకర్
బాలరాజు యాదవ్ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వంలోని బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చేస్తున్న నిరాధార రాజకీయ ఆరోపణలను ప్రశ్నించినందుకే బాలరాజు యాదవ్‌ను అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.
బాలరాజు యాదవ్ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వంలోని బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చేస్తున్న నిరాధార రాజకీయ ఆరోపణలను ప్రశ్నించినందుకే బాలరాజు యాదవ్‌ను అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, బల్మూరి వెంకట్ చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా సమాధానం ఇచ్చిన బాలరాజు యాదవ్‌ను అరెస్టు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చేస్తున్న ఆరోపణలను ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించే హక్కు లేదా? అని నిలదీశారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా? అని ప్రశ్నించిన కర్నె ప్రభాకర్.. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే, వాటికి రాజకీయంగా సమాధానం ఇచ్చే వారిపై పోలీసు చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
బాలరాజు యాదవ్‌పై అక్రమ కేసులు నమోదు చేయకుండా, ఆయనను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు సమాధానం విమర్శలతోనే ఇవ్వాలని, పోలీసు చర్యలతో కాదని అన్నారు. రాజకీయ భిన్నాభిప్రాయాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. బాలరాజు యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలరాజు యాదవ్ అరెస్టు అప్రజాస్వామికం.. వెంటనే విడుదల చేయాలి: కర్నె ప్రభాకర్
Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

