హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల పనితీరు అద్భుతమని, కార్పొరే ట్ స్కూళ్లను తలపిస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే ప్రశంసించారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని గురుకులంలో కల్పించిన వసతులు కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయని మెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఆయన చేపట్టిన రెండురోజుల పర్యటన శనివారం ముగిసింది. హెగ్డే మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి తెలంగాణ సర్కారు అమలుచేస్తున్న పథకాలు బాగున్నాయన్నారు. ఇక్కడి పథకాలను తమ ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్, ఉపేంద్ర, శుభప్రద పటేల్, కర్ణాటక కమిషన్ సభ్యులు అరుణ్‌కుమార్, సువ ర్ణ, రాజశేఖర్, కల్యాణ్‌కుమార్ పాల్గొన్నారు.