వైద్య కళాశాలల మంజూరుపై హర్షాతిరేకాలు
వైద్య కళాశాలల మంజూరుపై ఆయా జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వైద్యకళాశాలల మంజూరుపై టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం
- పలు జిల్లాల్లో కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
కరీంనగర్ కార్పొరేషన్/సిరిసిల్లటౌన్/కామారెడ్డి, ఆగస్టు 7: వైద్య కళాశాలల మంజూరుపై ఆయా జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వైద్యకళాశాలల మంజూరుపై టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఏండ్లనాటి కల నెరవేరనుండటంతో సంబురాల్లో మునిగితేలారు.
కరీంనగర్లో ఆదివారం టీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తావద్ద పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు అందుకు చొరవ చూపిన మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు పరిపాలనాపరమైన అనుమతులతోపాటు ప్రభుత్వ దవాఖానను అప్‌గ్రేడ్ చేయడంతో జిల్లాలోని పలుచోట్ల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, దోమకోండ, భిక్కనూర్, బీబీపేట, సదాశివనగర్, రామారెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కామారెడ్డి ప్రజల ఆకాంక్ష మేరకు వైద్య కళాశాలను మంజూరు చేయడంతోపాటు పరిపాలనా అనుమతులు ఇవ్వడం హర్షణీమన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాయకులు నృత్యాలు చేస్తూ, మహిళలు బతుకమ్మ ఆడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

