MLC Elections | కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం కొనసాగుతోంది. తాజాగా వచ్చిన తొమ్మిదో రౌండ్ ఫలితాల్లో అంజిరెడ్డికి 6245 ఓట్లు వచ్చాయి. దీంతో తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్తం 63,871 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి మొత్తంగా 59,831 ఓట్లు వచ్చాయి. తొమ్మిదో రౌండ్లో ఆయనకు 6921 ఓట్లు వచ్చాయి. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000 కాగా, ఇప్పటివరకు 1,89,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది.