Akunuru Vinay | జమ్మికుంట, అక్టోబర్ 10: చిన్నపాటి ఉద్యో గం సాధించాలంటేనే గగనమయ్యే ఈ రోజుల్లో.. కేవలం పది నెలల కాలంలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు ఓ యువకుడు. ఎలాంటి కోచింగ్లు తీసుకోకుండా.. ఆరు కొలువులు కొల్లగొట్టి ఆదర్శం గా నిలిచాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆకునూరు రాజు-స్వరూప దంపతుల కొడుకు వినయ్ కాకతీయ వర్సిటీలో బీపీఈడీ, ఉస్మానియాలో ఎంపీఈడీ పూర్తి చేశాడు. వినయ్ రెజ్లింగ్లో రాష్ట్ర, జాతీయ పతకాలు సాధించాడు.
2023 నుంచి ఇప్పటి వరకు డీఎస్సీ స్కూల్స్ పీఈటీ ఫలితాల్లో స్టేట్ ప్రథమ ర్యాంకు, డీఎస్సీ ఎస్ఏ (పీడీ) స్టేట్ రెండో ర్యాం కు, హైదరాబాద్ జిల్లా నాన్ లోకల్ కోటాలో ఫస్ట్ ర్యాంక్, క్వాలిఫైడ్ జేఆర్ఎఫ్ను, గురుకుల (పీడీ) రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు, పీ అండ్ హెచ్ఈగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం పొందాడు. ప్రస్తుతం ఝరాసంఘంలో పీ అండ్ హెచ్ఈగా విధులు నిర్వర్తిస్తున్నాడు.