ఖైరతాబాద్, జూలై 29: కాపు సామాజికవర్గాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటే ఉంటాయని కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాఘవరావు తెలిపారు. ఈ నెల 31న మియాపూర్‌లోని నరేన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న కాపుల ఆత్మగౌరవ సభ పోస్టర్లను శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ.. 2014, 2018 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2019 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కే మద్దతు ఇచ్చామని, భవిష్యత్తులోనూ తమ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపు మహాసభ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తాడిపాక రమేశ్‌నాయుడు, సమితి ప్రధాన కార్యదర్శి కేఎస్ఎన్ మూర్తి, దాసరి రంగారావు, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, గంధం రాజు, ఎం భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.rallies